Sonia Gandhi: సోనియాజీ.. ఇలా చేస్తే రాహుల్ ప్రధాని అవుతారు: జేసీ సలహా

  • యూపీ బ్రాహ్మణ యువతితో రాహుల్ కి పెళ్లి జరిపించండి
  • రాహుల్ తప్పకుండా ప్రధాని అవుతాడు
  • యూపీ ప్రజల ఆశీస్సులుంటేనే ఆ పదవి దక్కే అవకాశాలు 
వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలతో తరచుగా వార్తల్లో నిలిచే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన దైన ధోరణిలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ను లక్ష్యంగా చేసుకుని జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాహుల్ తల్లి సోనియాకు ఓ సలహా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణ యువతితో మీ అబ్బాయికి వివాహం జరిపిస్తే.. అతడు తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు’ అని జేసీ వ్యాఖ్యానించారు. యూపీ ప్రజల ఆశీస్సులు లభించిన వారికే ప్రధాని పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయని, అందుకే, ఆ రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణ యువతితోనే రాహుల్ కి పెళ్లి చేయించాలని సలహా ఇచ్చానని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ చెప్పడం గమనార్హం.
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News