botsa: జేసీ దివాకర్ రెడ్డి.. మనిషా? పశువా?: బొత్స

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనిషా? పశువా? అంటూ విరుచుకుపడ్డారు. వయసు పెరిగింది కానీ, బుర్ర పెరగలేదని... మెంటల్ ఎక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై భక్తి ఉంటే... పాదపూజ చేసి, నీళ్లు నెత్తిన చల్లుకోవాలని చెప్పారు.

విశాఖలో టీడీపీ చేపట్టిన దీక్షా శిబిరంలో జేసీ చాలా హీనంగా మాట్లాడారని... ఆయనకు హుందాతనం లేదని... నోటికి వచ్చినట్టు మాట్లాడతారని మండిపడ్డారు. రోడ్లపై తిరిగే వెధవలు మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాడు, వీడు అంటూ ఏకవచనంతో మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. వయసు పెరిగే కొద్దీ మనిషికి బుర్ర పెరగాలని... కానీ, జేసీ విషయంలో అది జరగలేదని చెప్పారు.
Go Back to Shorts
botsa
jc diwakar reddy

More Telugu News