Donald Trump: ఆహ్వానం అందుకోకుండానే.. పెళ్లికి వెళ్లి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ట్రంప్‌.. ఫొటోలు వైరల్

  • న్యూజెర్సీలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో ఘటన
  • వధూవరులతో ట్రంప్ సెల్ఫీలు
  • ఇలా వెళ్లడం ట్రంప్‌కి అలవాటే

తాజాగా న్యూజెర్సీలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతుండగా అక్కడికి ఊహించని అతిథి రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. తనను పిలవకుండానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులతో సెల్ఫీలు కూడా దిగారు.

ఇలా ఊహకు అందని పనులు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలుసార్లు వార్తల్లోకెక్కారు. ఇప్పటికే పలుసార్లు ఇలా పిలవని పెళ్లిళ్లకు వెళ్లి పెళ్లివారికి షాక్ ఇచ్చారు కూడా. తాజాగా ఈ పెళ్లికి హాజరై.. పెళ్లి వారిని చనువుగా పలకరిస్తూ హుషారుగా గడిపారు. తాజాగా ట్రంప్‌ వెళ్లిన పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.                                                

More Telugu News