KTR: బెంగళూరులో సినిమా షూటింగ్ లొకేషన్ కు వెళ్లిన కేటీఆర్!

  • బెంగళూరు పర్యటనలో ఉన్న కేటీఆర్
  • కుమారస్వామితో కలిసి అల్పాహారం, చర్చలు
  • నిఖిల్ గౌడ షూటింగ్ స్పాట్ లో సందడి

తెలంగాణ మంత్రి కేటీఆర్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో కలసి ఈ ఉదయం అల్పాహారం స్వీకరించిన కేటీఆర్... తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ, హరితహారం తదితర ప్రభుత్వ పథకాల గురించి ఆయకు వివరించారు.

ఆ తర్వాత కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ (జాగ్వార్ ఫేం) హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతారామకల్యాణ' షూటింగ్ లోకేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులోనే జరుగుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ తో కలిసి సినిమా రషెస్ చూసి, సాంకేతిక నిపుణుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూనిట్ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.

More Telugu News