454 మంది మందుబాబులకు జైలు శిక్ష.. గరిష్టంగా నెల రోజుల శిక్ష!
- జూన్ లో 2,735 కేసులు నమోదు
- 101 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు
- రూ. 67 లక్షలకు పైగా జరిమానాలు
వీరిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 454 మందికి కోర్టు జైలు శిక్షను విధించింది. ఒక్కొక్కరికి రెండు రోజుల నుంచి గరిష్టంగా నెల రోజుల వరకు శిక్షను ఖరారు చేసింది. పదేపదే తనిఖీల్లో బయటపడిన 101 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసింది. వీరిలో 12 మంది లైసెన్సులను శాశ్వతంగా... మిగిలిన వారి లైసెన్స్ లను గరిష్టంగా ఏడేళ్ల వరకు రద్దు చేసింది. జరిమానాల రూపంలో పోలీస్ శాఖకు రూ. 67,50,200 జమ అయ్యాయి.