bumrah: టీమిండియాకు ఎదురుదెబ్బ.. టీ20 సిరీస్ కు దూరమైన బుమ్రా

  • ఇంగ్లండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు దూరం
  • ఐర్లండ్ తో జరిగిన టీ20 సందర్భంగా గాయపడ్డ బుమ్రా
  • పాదానికి అయిన గాయంతో వాషింగ్టన్ సుందర్ కూడా దూరం
ఐర్లండ్ తో జరిగిన రెండు టీ20ల్లో సత్తా చాటిన టీమిండియా... అత్యంత కీలకమైన ఇంగ్లండ్ సిరీస్ కు సమాయత్తమవుతోంది. అయితే, సిరీస్ ప్రారంభం కావడానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న పేసర్ బుమ్రా జూలై 12 నుంచి జరగనున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. ఐర్లండ్ తో జరిగిన తొలి టీ20 సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే వన్డే సిరీస్ ప్రారంభమయ్యే నాటికి ఆయన కోలుకుంటాడని భావిస్తున్నారు. మరోవైపు, ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సందర్భంగా ఫుట్ బాల్ ఆడుతూ సుందర్ గాయపడ్డాడు. అతని కుడి పాదానికి గాయమయింది.
bumrah
team india
injury

More Telugu News