mukhesh gowd: ముఖేష్ గౌడ్ తో భేటీ అయిన టీఆర్ఎస్ నేత

  • టీఆర్ఎస్ లో ముఖేష్ గౌడ్ చేరబోతున్నారంటూ ప్రచారం
  • ముఖేష్ తో భేటీ అయిన మైనంపల్లి
  • పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైనం
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, అతని కుమారుడు విక్రమ్ గౌడ్ లతో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని, టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో, వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరోవైపు ఈ ఉదయం మీడియాతో ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే, పార్టీ మారే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
mukhesh gowd
mainampalli
TRS

More Telugu News