పౌరీగల్వార్ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మోదీ

  • ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
  • లోయలో పడ్డ బస్సు.. 47కి పెరిగిన మృతుల సంఖ్య
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మోదీ
ఉత్తరాఖండ్ లోని పౌరీగల్వార్ లో ఈ ఉదయం బస్సు లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 47కి పెరిగింది. ఈ ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

సుమారు 55 మంది ప్రయాణికులతో రామ్ నగర్ నుంచి భోహన్ కు బస్సు బయల్దేరింది. బయల్దేరిన కొద్ది సేపటికే బస్సు లోయలో పడిపోయింది. ఘటనా స్థలిని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
Go Back to Shorts
modi
Uttarakhand
bus accident

More Telugu News