kcr: కేసీఆర్ తో భేటీ అయిన దేవేగౌడ

  • ఎంపీ సుబ్బరామిరెడ్డి మనవడి వివాహానికి వచ్చిన దేవేగౌడ
  • ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ
  • పలు విషయాలపై చర్చలు జరిపిన నేతలు
హైదరాబాదుకు వచ్చిన మాజీ ప్రధాని దేవేగౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ కు వచ్చి, ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. దేవేగౌడకు కేసీఆర్ శాలువాకప్పి సత్కరించి, ఓ జ్ఞాపికను బహూకరించారు.

ఈ సందర్భంగా పలు విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి దేవేగౌడ బెంగళూరుకు బయల్దేరారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి మనవడి వివాహానికి హాజరయ్యేందుకు నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు దేవేగౌడ వచ్చిన సంగతి తెలిసిందే.
kcr
deve gowda

More Telugu News