budha venkanna: బీజేపీ మొత్తాన్ని వైసీపీలో కలిపేస్తారు: కన్నాపై బుద్ధా సెటైర్లు

  • బీజేపీకి సొంత మైకు, వైసీపీకి అద్దె మైకులా మారారు
  • కన్నా అవినీతి గురించి అందరికీ తెలుసు
  • అవినీతి మరకలను చంద్రబాబుకు అంటించే ప్రయత్నం చేస్తున్నారు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. బీజేపీకి
సొంత మైకు, వైసీపీకి అద్దె మైకులా కన్నా తయారయ్యారని అన్నారు. వైయస్ హయాంలో కన్నా చేసిన అవినీతి అందరికీ తెలుసని చెప్పారు. ఏదో ఒక రోజు కన్నా లక్ష్మినారాయణ రాష్ట్ర బీజేపీ కేడర్ ను వైసీపీలో కలిపేస్తారని అన్నారు. అవినీతి చరిత్ర కలిగిన కన్నా... ఆ మరకలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ అయితే... పార్టీని బతికించింది చంద్రబాబు అని అన్నారు.
budha venkanna
kanna lakshminarayana
ysrcp
bjp
Telugudesam
chandrababu
ys

More Telugu News