Balakrishna: ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉంది!: బాలకృష్ణ

  • గవర్నర్ పేటలో బసవతారకం క్లినిక్, సమాచార కేంద్రం ప్రారంభం
  • ఆగస్టు 15న అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నామన్న బాలయ్య
  • అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదు

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఏపీలో కార్యకలాపాలను ప్రారంభించింది. విజయవాడలోని గవర్నర్ పేటలో ఇండో-అమెరికన్ క్యాన్సర్ క్లినిక్, సమాచార కేంద్రాన్ని బాలయ్య, స్పీకర్ కోడెల ప్రారంభించారు.

ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ, అమరావతిలో బసవతారకం ఆసుపత్రిని నిర్మించబోతున్నామని చెప్పారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఆగస్టులో ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. క్యాన్సర్ తో మా అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించామని తెలిపారు. ఆసుపత్రి సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. హైదరాబాదులోని ఆసుపత్రి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పన్ను రద్దు చేసిందని... అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

More Telugu News