Jagapati Babu: దర్శకుడి భార్యను ఎవరు చంపారన్న కథాంశంతో రూపొందిన 'ఆటగాళ్లు'!

  • నారా రోహిత్, జగపతిబాబు నటించిన మల్టీస్టారర్
  • థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన 'ఆటగాళ్లు'
  • ప్రేక్షకులకు నచ్చుతుందన్న జగపతిబాబు
ఒక దర్శకుడు ఉన్నాడు. అతను లవ్ స్టోరీస్ ను సినిమాగా మలచి హిట్ సాధించడంలో నేర్పరి. తన తెలివితేటలతో ఓ అమ్మాయిని లవ్ లో పడేశాడు. ఇద్దరూ వివాహం చేసుకుని అన్యోన్యంగా ఉన్న సమయంలో ఆమె దారుణ హత్యకు గురి అయింది. ఆ నేరం దర్శకుడిపై పడింది. ఇక ఆ హత్యను ఎవరు చేశారు? ఆమె హత్యలో దర్శకుడి పాత్ర ఎంత?... చదివితే ఆసక్తికరంగా అనిపిస్తున్న ఈ స్టోరీ లైన్ 'ఆటగాళ్లు' సినిమా కథ.

విలక్షణ నటుడు జగపతిబాబు, నారా రోహిత్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం. దీనికి పరుచూరు మురళి దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని శేఖర్ కమ్ముల విడుదల చేయగా, జగపతిబాబు మాట్లాడుతూ, ఈ చిత్రం ఓ థ్రిల్లర్ కథాంశమని, హత్య చుట్టూ తిరుగుతుందని, దర్శకుడి భార్యను ఎవరు చంపారన్న కథ ప్రేక్షకులను కట్టి పడేస్తుందని చెప్పాడు. మరి అసలు విషయం తెలియాలంటే, సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.
Jagapati Babu
Nara Rohit
Aatagaallu
Tollywood
Thriller
Movie

More Telugu News