పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం... గడువును పొడిగించిన కేంద్రం!
- 2019 మార్చి 31 వరకూ పొడగింపు
- ప్రకటన విడుదల చేసిన సీబీడీటీ
- వేచిచూడాలన్న ఆలోచనలో కేంద్రం
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో జూన్ 30 వరకూ గడువును పొడిగించిన సీబీడీటీ, అది నిన్నటితో ముగియగా, ఆధార్ చట్టబద్ధతపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపథ్యంలో, తీర్పు వెలువడేంత వరకూ పాన్, ఆధార్ అనుసంధానం గడువును పొడిగించాలని కేంద్రం భావిస్తోంది.