పనిచేయని టిమ్ యంత్రాలు... ఏపీలో పలుచోట్ల నిలిచిన బస్సులు!
- పలు ప్రాంతాల్లో నిలిచిన బస్సులు
- విజయవాడలో ఆగిన కనిగిరి డిపో బస్సులు
- ప్రయాణికుల ఆందోళన
తెల్లవారుజామున 3.30 గంటల నుంచి విజయవాడ - కనిగిరి మధ్య ప్రయాణానికి బయలుదేరాల్సిన మూడు బస్సుల్లోని టికెట్ మెషీన్ లు పనిచేయక పోవడంతో, ఈ బస్సులు ప్లాట్ ఫారానికే పరిమితం అయ్యాయి. అప్పటి నుంచి బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే సమస్య నెలకొనివుండగా, రంగంలోకి దిగిన ఆర్టీసీ సాంకేతిక సిబ్బంది టిమ్ యంత్రాలను చక్కదిద్దే పనిలో పడ్డారు.