Yanamala: జీఎస్టీలోకి 'పెట్రో' వద్దేవద్దు... అంగీకరించే సమస్యే లేదన్న యనమల!

  • సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలనే జీఎస్టీకి మద్దతు
  • కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది
  • రాష్ట్రాలపై పెత్తనాన్ని అడ్డుకుంటామన్న యనమల

పెట్రోలు, డీజెల్ లతో పాటు గ్యాస్, మద్యం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము ఎంతమాత్రమూ అంగీకరించేది లేదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. నేడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలన్న ఉద్దేశంతోనే జీఎస్టీకి మద్దతిచ్చామని, కానీ, కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

 తన అధికారంతో రాష్ట్రాలపై పెత్తనం సాగిస్తున్న కేంద్రాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు తగ్గకుండా పన్ను విధానాలుండాలని అభిప్రాయపడ్డ యనమల, జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు, మద్యం ఉత్పత్తులను తెచ్చేందుకు తాము అంగీకరించే సమస్యే లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే వీటిపై పన్ను రూపంలో లభించే ఆదాయమే కీలకమని అన్నారు.

More Telugu News