Vijayawada: సరిగ్గా పెళ్లి కుదిరిన సమయానికి... ఎన్ఆర్ఐ కాలేజీ విద్యార్థిని రేప్ వీడియో కేసులో కొత్త ట్విస్ట్!

  • బెదిరించి డబ్బు గుంజారు
  • అమ్మాయి బంగారు గొలుసును కాజేశారు
  • వీడియో ఎక్కడున్నా తొలగించాల్సిందే
  • లేకుంటే చర్యలు తప్పవన్న పోలీసులు

విజయవాడ ఎన్నారై కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిని రేప్ చేసి, వీడియోలు తీసిన కేసులో అరెస్ట్ చేసిన నిందితులను విచారించిన పోలీసులు మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చారు. ముగ్గురు విద్యార్థులకు కేసులో ప్రమేయం ఉండగా, వారంతా అమ్మాయిని లైంగికంగా వేధించారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు బెదిరించి డబ్బు తీసుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. గడచిన మే నెలలో, వీడియోలు ఇంకా తమ వద్ద ఉన్నాయని, వాటిని బయట పెడతామని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, బంగారు గొలుసును నొక్కేశారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పని ఆ అమ్మాయి, గొలుసు పోయిందని అబద్ధమాడింది. మరికొన్ని విలువైన వస్తువులనూ తీసుకున్నారు.

ఆ తరువాత ఆమెకు వివాహం కుదరగా, పెళ్లి కుదిరే సమయానికి మరోసారి వారు వేధించడం ప్రారంభించారని, తామడిగినంత డబ్బిచ్చి, కోరిక తీర్చకుంటే కాబోయే భర్తకు వీడియోలు చూపిస్తామని బెదిరించారని వెల్లడించారు. ఈ కేసులో కృష్ణ వంశీ, శివారెడ్డి, ప్రవీణ్ నిందితులని, వీరంతా ప్రస్తుతం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. విషయం కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లినా, పోలీసు కంప్లయింట్ ఇవ్వనందుకు వారిపై ఐపీసీలోని నిర్లక్ష్యం (నెగ్లిజన్స్) సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. పలు వాట్స్ యాప్ గ్రూపుల్లో రేప్ వీడియో షేర్ అయి ఉందని, వాటిని తొలగించాలని గ్రూప్ అడ్మిన్ లను కోరామని, తొలగించకుంటే వారిపైనా కేసులు పెడతామని తెలిపారు. 

More Telugu News