Aadhar: పుట్టిన వెంటనే ఆధార్... విజయవాడలో అమలు!

  • కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా అమలు
  • వేలిముద్రల అవసరం లేదు
  • ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వేణుగోపాల్ రెడ్డి

బిడ్డ పుట్టిన రోజే ఆధార్ కార్డును అందించే విధానాన్ని విజయవాడలోని కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జి.వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. రెండు నెలల్లోనే గుర్తించిన ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పుట్టిన బిడ్డల వేలిముద్రలతో అవసరం ఉండదని, వారి తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యను నమోదు చేసుకుని, ఆధార్ కార్డును ఇస్తామని, బిడ్డకు ఐదేళ్లు వచ్చిన తరువాత వేలిముద్రలు ఇస్తే సరిపోతుందని తెలిపారు.

గతంలో ఈ విధానం అందుబాటులో లేదని, విజయవాడలో పరిశీలన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఐదేళ్లలోపు చిన్నారులు 28,83,939 మంది ఉండగా, 18,66,311 మందికి, ఆంధ్రప్రదేశ్‌లో 37,70,250 మంది చిన్నారులకుగాను 25,17,082 మందికి ఆధార్ కేటాయించినట్టు తెలియజేశారు.

More Telugu News