nita ambani: డ్యాన్స్ తో అదరగొట్టిన నీతా అంబానీ.. వీడియో చూడండి

  • ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి
  • శ్లోకాతో ఆకాశ్ అంబానీ వివాహం
  • మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేసిన నీతా అంబానీ

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ముఖేష్, నీతాల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకాతో జరగబోతోంది. ఈ నెల 30న నిశ్చితార్థం జరగనుంది. బుధవారం రాత్రి వీరి నివాసంలో మెహందీ వేడుక జరిగింది.

ఈ కార్యక్రమానికి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ దంపతులు, ప్రియాంక చోప్రా, కరణ్ జొహార్, రణబీర్ కపూర్, అలియా భట్, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ తదితరులు తరలి వచ్చారు. ఈ వేడుకలో నీతా అంబానీ చేసిన డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. ఎరుపు రంగు చీర ధరించిన ఆమె సంప్రదాయ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News