న్యూయార్క్ టైమ్స్ పత్రికలో చంద్రబాబుపై ప్రత్యేక కథనం.. ప్రశంసలు!
- వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలంటూ కథనం
- కథనంలో ఏపీ గురించి ప్రస్తావన
- జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పై ప్రశంసలు
వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలంటూ ప్రచురించిన కథనంలో ఈ మేరకు ఏపీ గురించి ప్రస్తావించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ. 2500 కోట్లు వెచ్చిస్తోందంటూ కథనంలో పేర్కొంది. ఈ ఏడాది చివర కల్లా 5 లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 60 లక్షల మంది రైతులు ఇదే తరహాలో వ్యవసాయం చేసే అవకాశం ఉందని పేర్కొంది.