Tamilnadu: పది రోజుల జైలు అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన తమిళ నటి నీలాణి!

  • తూత్తుకుడి కాల్పులపై విమర్శలు చేసి జైలుకు వెళ్లిన నీలాణి
  • బెయిల్ కోసం దరఖాస్తు
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు

పోలీసు వేషం వేసుకుని తూత్తుకుడి కాల్పులపై విమర్శలు చేసి జైలుకు వెళ్లిన తమిళ నటి నీలాణికి సైదాపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కాపర్ ప్లాంట్ వద్దని తూత్తుకుడి వాసులు నిరసనలు తెలియజేస్తున్న వేళ, పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు మరణించారు కూడా.

ఆపై నీలాణి పోలీస్ వేషంలో కనిపించి విమర్శలు గుప్పిస్తూ, కాల్పుల దృశ్యాలను చూపించగా, ఆ వీడియో వైరల్ అయింది. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందగా, 19వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు. బెయిల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకోవడంతో, నగరం వదిలి వెళ్లవద్దని, పోలీసుల విచారణకు సహకరించాలని షరతులు విధిస్తూ సైదాపేట న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు.

More Telugu News