Rahul Gandhi: ఈ పిచ్చితనంపై కలసి పోరాడుదాం రండి: రాహుల్ గాంధీ పిలుపు

  • ఢిల్లీలో నాలుగేళ్లలో వేలాది చెట్లను కూల్చేశారు
  • ఆప్ సహకారంతో బీజేపీ ఈ పని చేసింది
  • మన జీవనానికి చెట్లు కీలకమన్న విషయం పిల్లలకు కూడా తెలుసు
  • ట్విట్టర్లో రాహుల్ గాంధీ
ఢిల్లీలో అభివృద్ధి పేరిట చెట్లను తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఈ రోజు స్పందించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆమోదంతో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరిట వేలాది చెట్లను కూల్చివేయడం జరిగిందని రాహుల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

చెట్లు అన్నవి మనం జీవించేందుకు చాలా కీలకమైనవి అని, వాటిని తిరిగి భర్తీ చేయలేమన్న విషయం చిన్న పిల్లలకు సైతం తెలుసని పాలకులను విమర్శించారు. కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని, కలసికట్టుగా ఈ పిచ్చితనంపై పోరాడుదామని రాహుల్ పిలుపునిచ్చారు.
Rahul Gandhi
New Delhi
trees

More Telugu News