tractor: ట్రాక్టర్‌తో పొలం దున్ని.. విత్తనాలు చల్లిన ఏపీ సీఎం చంద్రబాబు

  • శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • ఆముదాలవలసలో 'ఏరువాక'లో పాల్గొన్న చంద్రబాబు
  • స్వయంగా ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ క్షేత్రానికి..
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'ఏరువాక' ప్రారంభించారు. స్వయంగా ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న చంద్రబాబు అనంతరం ట్రాక్టర్‌తో పొలం దున్ని.. విత్తనాలు చల్లారు. యంత్రశ్రీ వరినాట్ల పరికరంతో నాట్లు వేశారు. తొలకరి ఆగమనంతో ఆనందోత్సాహాల మధ్య తెలుగు రైతులు జరుపుకునే సామూహిక ఉత్సవం 'ఏరువాక' అని, ఈ ఏడాది రైతుల జీవితాల్లో సంతోషాలు నింపాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ప్రకృతిని వేడుకుంటున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.       
tractor
Chandrababu
Andhra Pradesh

More Telugu News