tammareddy: 'బిగ్ బాస్ 2'లో ఆ ముగ్గురు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో 'బిగ్ బాస్ 2' కార్యక్రమం ఇప్పుడిప్పుడే మరింత ఊపందుకుంటోంది. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం కోసం చాలామంది ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ షో మొదలై కొన్ని రోజులే అయినా ఎవరు ఏ వారంలో ఎలిమినేట్ అవుతారు? ఎవరు విజేతగా నిలుస్తారు? అనే విషయంపై అన్నిచోట్లా ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్ 2' గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఆయా విభాగాలలో పాప్యులర్ అయిన వాళ్లను ఈ సారి 'బిగ్ బాస్ 2' కోసం తీసుకున్నారు. నాకు తెలిసి 'బిగ్ బాస్ 2' లో బాబు గోగినేని .. గీతామాధురి .. తేజస్వి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. బాబు గోగినేని లాజిక్ లు మాట్లాడతారు .. గీతా మాధురి పాటలు బాగా పాడుతుంది .. ఇక తేజస్వి చాలా యాక్టివ్ గా ఉంటుంది" అంటూ .. ఈ ముగ్గురిలో ఒకరు 'బిగ్ బాస్ 2' లో విజేతలుగా నిలిచే అవకాశం వుందనే విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పారు.  
Go Back to Shorts
tammareddy

More Telugu News