jet: 30 శాతం తగ్గింపు ధరలతో టిక్కెట్లు... జెట్‌ ఎయిర్‌ వేస్‌ అఫర్‌!

  • అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో ప్రయాణం
  • కొన్ని మార్గాల్లో ప్రయాణించే విమాన టిక్కెట్లకు మాత్రమే పరిమితం
  • ఈ నెల 30 వరకు బుకింగ్స్‌

ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌ వేస్‌ అంతర్జాతీయ, దేశీయ విమాన టికెట్లపై తగ్గింపు ధరలకు టిక్కెట్లు అందిస్తోంది. ఈ మేరకు వెల్లడైన వివరాల ప్రకారం, అంతర్జాతీయ విమాన టికెట్లపై 30 శాతం తగ్గింపుతోను, అలాగే దేశీయ విమాన టికెట్లపై 25 శాతం తగ్గింపుతోను టిక్కెట్లు పొందచ్చు. ఆఫర్‌లో వస్తోన్న ఈ టిక్కెట్లు కొన్ని మార్గాల్లో ప్రయాణించే విమాన ప్రయాణాలకు మాత్రమే పరిమితం. నిన్న ప్రారంభమైన ఈ బుకింగ్స్‌ ఈ నెల 30 వరకు చేసుకోవచ్చు. టిక్కెట్లు పొందిన వారు జూలై 11 నుంచి దేశీయ విమానాల్లో ప్రయాణించవచ్చు. 

More Telugu News