ramana deekshitulu: రమణ దీక్షితులు నిర్వహించిన వ్యాపారాల వివరాలను ఇన్ ఛార్జ్ సీఎస్ కు అందించిన సాయిబాబు

  • ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు వ్యాపార సంస్థలు ప్రారంభించారు
  • అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి
  • అన్యమతస్తులు, నేర చరిత్ర ఉన్నవారితో కలిసి పని చేశారు
సర్వీస్ నిబంధనలను తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సీఎస్ కు టీడీపీ నేత సాయిబాబు ఫిర్యాదు చేశారు. రమణ దీక్షితులు నిర్వహించిన వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలను అందజేశారు.

అనంతరం సాయిబాబు మీడియాతో మాట్లాడుతూ, తిరుమల ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు కొన్ని వ్యాపార సంస్థలను రమణ దీక్షితులు ప్రారంభించారని అన్నారు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అన్యమతస్తులు, నేర చరిత్ర ఉన్న వారితో కలిసి ఆయన పని చేశారని ఆరోపించారు. ఎలాంటి వ్యాపారాలు చేయలేదని తిరుమల ధ్వజస్తంభం వద్ద రమణ దీక్షితులు ప్రమాణం చేసి చెప్పగలరా? అని ఆయన సవాల్ విసిరారు.
ramana deekshitulu
saibabu

More Telugu News