renu desai: అకీరా అప్ సెట్ అయ్యాడనే వార్తలపై రేణు దేశాయ్ స్పందన

  • అకీరా అప్ సెట్ అయిన మాట నిజమే
  • కానీ... నా పెళ్లి గురించి కాదు
  • మెనూలో పన్నీర్ బటర్ మసాలా లేదని అప్ సెట్ అయ్యాడు
ప్రముఖ నటి రేణూ దేశాయ్ త్వరలో వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఆమె ఎవరిని పెళ్లాడబోతున్నారనే వివరాలు వెల్లడి కాకపోయినప్పటికీ... త్వరలోనే ఆమె మరో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో, రేణు పెళ్లి చేసుకోబోతుండటంపై ఆమె కుమారుడు అకీరా అప్ సెట్ అయ్యాడనే వార్తలు షికారు చేశాయి.

ఓ ఆంగ్ల పత్రిక ఇదే విషయం గురించి రేణును ప్రశ్నించింది. ఈ ప్రశకు రేణు స్పందిస్తూ... తన రెండో పెళ్లి గురించి అకీరా అప్ సెట్ అయ్యాడని కొందరు అంటున్నారని... అకీరా అప్ సెట్ అయిన మాట నిజమేనని చెప్పారు. అయితే, అకీరా అప్ సెట్ అయింది పెళ్లి గురించి కాదని... మెనూలో పన్నీర్ బటర్ మసాలా లేదని అంటూ నవ్వేస్తూ, సరదాగా సమాధానమిచ్చారు.
renu desai
akira
Pawan Kalyan
marriage

More Telugu News