నాడు రెండు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లాను: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- ‘ఎమర్జెన్సీ: ఇండియన్ డెమోక్రసీ డార్కెస్ట్ అవర్’ పుస్తకావిష్కరణ
- ఎమర్జెన్సీ గురించి కొత్తతరం తెలుసుకోవాలి
- నాడు నన్ను అరెస్టు చేసి 17 నెలలు జైలులో ఉంచారు
ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో స్వీయ అనుభవాల గురించి వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్ నారాయణ్, వాజ్ పేయి, అద్వానీ సహా పలువురిని జైలులో పెట్టారని, ఆ సమయంలో తాను విద్యార్థిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు. తనను కూడా అరెస్టు చేసి 17 నెలలు జైలులో ఉంచారని, ఆ సమయంలోనే ప్రముఖ విపక్ష నేతలు, పాత్రికేయులు, రచయితలతో తనకు సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మోదీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నారని చెప్పారు. అజ్ఞాతంలోకి వెళ్లి జైలులో ఉన్నవారి కుటుంబాలను ఆదుకోవడంలో మోదీ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారని వెంకయ్యనాయుడు చెప్పారు.