పార్టీలు మారి మమ్మల్నే విమర్శిస్తారా?: పురందేశ్వరికి మంత్రి దేవినేని కౌంటర్
- మొన్నటి దాకా సోనియా వరం అన్నవారు.. ఇప్పుడు మోదీ వరం అంటున్నారు
- పురందేశ్వరి, కన్నాలు బీజేపీలోకి ఎప్పుడు వచ్చారు?
- పోలవరం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారు
పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలు బీజేపీలోకి ఎప్పుడు వచ్చారని ఉమ ప్రశ్నించారు. కొంత కాలం క్రితం సోనియాగాంధీ వరం అన్నవాళ్లు... ఇప్పుడు మోదీ వరం అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని... ఏ ఒక్క ప్రాజెక్టు వివరాలను కూడా ఆన్ లైన్ లో పెట్టలేని అసమర్థతలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.