Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వెంకటేశ్ తో మరోసారి నయనతార 
  • యుద్ధం నేపథ్యంలో నారా రోహిత్ సినిమా 
  • జపాన్ కు వెళుతున్న 'మగధీర'

*  సీనియర్ హీరోయిన్ నయనతార మరోసారి వెంకటేశ్ తో జతకట్టనుంది. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, చైతూ హీరోలుగా 'వెంకీ మామ' పేరిట ఓ మల్టీ స్టారర్ నిర్మిస్తున్నారు. ఇందులో వెంకీ సరసన నయన్ ను తీసుకుంటున్నట్టు, చైతూ సరసన సమంత నటిస్తున్నట్టు సమాచారం.
*  నారా రోహిత్ తన తొలి చిత్ర (బాణం) దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. బాణం, బసంతి వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చైతన్య తాజాగా రోహిత్ కోసం యుద్ధం నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేశాడట.
*  గతంలో రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి చిత్రం 'మగధీర'ను జపాన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జపనీస్ భాషలోకి అనువదించే పనులు జరుగుతున్నాయట.  

More Telugu News