Chandrababu: చంద్రబాబుకు నిజం మాట్లాడటం, మాకు అబద్ధాలు చెప్పడం చేతకాదు: కన్నా లక్ష్మీనారాయణ

షార్ట్స్‌లో చూడండి
పోలవరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసాను కేంద్రం చెల్లించిందని అన్నారు. ‘పోలవరం’పై చంద్రబాబు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాజమండ్రిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు నిజం మాట్లాడటం, తమకు అబద్ధాలు చెప్పడం చేతకాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో తెలుగుదేశం, వైసీపీ కుమ్మక్కై సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని అన్నారు. రాజమండ్రిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వీళ్లిద్దరూ కలిసి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు.

‘పోలవరం’ ఆంధ్రా ప్రజల దీర్ఘకాలిక స్వప్నం

ఏపీకి మోదీ ఇచ్చిన వరం పోలవరం ప్రాజెక్టు అని బీజేపీ మహిళానేత పురందేశ్వరి అన్నారు. రాజమండ్రిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ఆంధ్రా ప్రజల దీర్ఘకాలిక స్వప్నం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పోలవరం జీవనాడి అనే విషయం ప్రతిఒక్కరికీ తెలుసని అన్నారు. ‘పోలవరం’ నిర్మాణంపై తనకు ఉన్న అంకిత భావాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరూపించుకోవటం జరిగిందని అన్నారు. విభజన బిల్లు ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికి, బీజేపీకే దక్కుతుందని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
kanna

More Telugu News