బీఎస్సీ విద్యార్థికి బీకాం పట్టా.. ఏయూ నిర్వాకం

24-06-2018 Sun 08:35
  • సైన్స్ విద్యార్థికి కామర్స్ సర్టిఫికెట్
  • అవాక్కైన విద్యార్థి
  • సరిదిద్దే పనిలో అధికారులు

బీకాంలో ఫిజిక్స్.. టీడీపీ నేత జలీల్ ఖాన్ పుణ్యమా అని దీనికి విపరీతమైన ప్రచారం లభించింది. బీకాంలో ఫిజిక్స్ సంగతేమో కానీ ఆంధ్రా యూనివర్సిటీ మాత్రం బీఎస్సీ విద్యార్థికి బీకాం పట్టా ఇచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

డిగ్రీలో సైన్స్ విద్యార్థికి బీకాం ఒరిజనల్ డిగ్రీ (ఓడీ) పట్టా అందించి తన నిర్లక్ష్యాన్ని చాటుకుంది. పార్ట్-1లో ఇంగ్లిష్, తెలుగు, హెచ్‌సీ సబ్జెక్టులు, పార్ట్‌-2లో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులు అభ్యసించినట్లుగా అందులో పేర్కొంది. అది చూసిన విద్యార్థి నివ్వెరపోయాడు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కంగుతిన్నారు. గుట్టుచప్పుడు కాకుండా దానిని సరిదిద్దే పనిలో పడ్డారు.