nithya menon: ఆసక్తిని రేపుతోన్న నిత్యామీనన్ 'ప్రాణ' ఫస్టులుక్

  • నిత్యామీనన్ తాజా చిత్రంగా 'ప్రాణ'
  • దర్శకుడిగా వీకే ప్రకాశ్ 
  • నాలుగు భాషల్లో విడుదల    

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నిత్యామీనన్ కి ఎంతో క్రేజ్ వుంది. ఈ నాలుగు భాషల్లోను ఆమె నటనకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సినిమాలు వున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి నటన పరంగా నిత్యామీనన్ నూటికి నూరు మార్కులు కొట్టేసింది. అలాంటి నిత్యామీనన్ ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను తగ్గించింది. తనకి నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెప్పే ఆమె స్వభావమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఆమె 'ప్రాణ' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా మొత్తం మీద వున్న ఆర్టిస్ట్ ఒక్క నిత్యామీనన్ మాత్రమే. ఆమె చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది .. అదే ఈ సినిమా ప్రత్యేకత. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా నిత్యామీనన్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయబడిన ఈ ఫస్టులుక్ .. ఈ సినిమా కాన్సెప్టుపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.     

More Telugu News