gunasekhar: గుణశేఖర్ 'హిరణ్యకశిప'పై స్పందించిన సురేశ్ బాబు

  • గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప'
  • సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం 
  • రెండేళ్లుగా జరుగుతోన్న సన్నాహాలు  

'రుద్రమదేవి' వంటి భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించి మెప్పించిన గుణశేఖర్, ఆ తరువాత 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా చెప్పారు. ఇది ప్రహ్లాదుడి కథేననీ .. అయితే హిరణ్యకశిపుడి వైపు నుంచి కథ నడుస్తుందని అన్నారు. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా రానా నటించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తరువాత నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు.అయితే తాజాగా సురేశ్ బాబు మాటలను బట్టి చూస్తే .. ఈ ప్రాజెక్టు ఉందనే విషయం స్పష్టం అవుతోంది. తాజాగా సురేష్ బాబు మాట్లాడుతూ .. "గుణశేఖర్ సిద్ధం చేసుకున్న 'హిరణ్యకశిప' కథ .. ఆయన దర్శకత్వంలో .. మా బ్యానర్లో నే రూపొందుతుంది. రెండేళ్ల నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది ఇప్పుడే చెప్పలేను. గుణశేఖర్ .. రానా దగ్గరుండి ఆ పనులను చూసుకుంటున్నారు. మా బ్యానర్ కి ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ అవుతుంది. మా బ్యానర్లో ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఇదే మొదటిసారి" అని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News