వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత.. బీజేపీ మండిపాటు!
- ముషారఫ్ వ్యాఖ్యలకు మద్దతు
- కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్‌తో కలవాలని అనుకోవట్లేదు
- స్వాతంత్ర్యం కావాలనుకుంటున్నారు
సోజ్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. ఆయన పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని అన్నారు. 1991లో జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు సోజ్ కూతురును కిడ్నాప్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా స్వామి ప్రస్తావించారు. భారత్‌లో ఉండాలనుకునే వాళ్లు రాజ్యాంగ బద్ధంగా ఉండాలని హితవు పలికారు. సోజ్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు.