madhavi latha: మహేష్ బాబు ముందే డైరెక్టర్ నన్ను బూతులు తిట్టాడు.. కానీ, ఆయన పట్టించుకోలేదు!: మాధవీలత

  • 'అతిథి' సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది
  • అలా ఎందుకు మాట్లాడావు అని మహేష్ అడిగి ఉండొచ్చు
  • మన హీరోలంతా స్క్రీన్ పైనే రెస్పాండ్ అవుతారు
షూటింగ్ సమయంలో ఏం జరిగినా తెలుగు హీరోలు పట్టించుకోరని హీరోయిన్ మాధవీలత ఆవేదన వ్యక్తం చేసింది. 'అతిథి' సినిమా షూటింగ్ సందర్భంగా మహేష్ బాబు ముందే డైరెక్టర్ తనపై ఓ బూతు పదం వాడాడని... అయినా మహేష్ బాబు స్పందించలేదని ఆమె తెలిపింది.

పెద్ద స్టార్ అయిన మహేష్ బాబుది డైరెక్టర్ కు చెప్పే స్థాయి అని, అలా ఎందుకు మాట్లాడావు? అంటూ ఒక మాట చెప్పి ఉండవచ్చని, కానీ ఆయన అలా చేయలేదని చెప్పింది. మన తెలుగు హీరోలు కేవలం స్క్రీన్ మీదే రియాక్ట్ అవుతారని, రియల్ లైఫ్ లో స్పందించరని తెలిపింది. ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. మహేష్ బాబుపై తనకు ఎలాంటి శత్రుత్వం లేదని... అయితే, అమ్మాయిల సమస్యలపై హీరోలు ఎందుకు స్పందించడం లేదనేదే తన ప్రశ్న అని తెలిపింది. 
madhavi latha
mahesh babu
tollywood

More Telugu News