Jammu And Kashmir: వేట మొదలైంది... కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల ఎన్ కౌంటర్... వీర మరణం పొందిన జవాను!

  • ప్రారంభమైన ఉగ్రవాదుల వేట
  • అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
  • ఇద్దరు పౌరులకు గాయాలు
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల వేటను ప్రారంభించింది. ఈ ఉదయం అనంతనాగ్ జిల్లాలోని శ్రీగుప్వారాలో భారీ ఎన్ కౌంటర్ జరుగగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఇంట్లో ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని సైనిక బలగాలు చుట్టుముట్టాయి.

విషయం గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించగా, సైనికులు ఎన్ కౌంటర్ ప్రారంభించారు. ఈ ఘటనలో ఓ జవాను వీరమరణం పొందగా, మరో ఇద్దరు పౌరులకు బులెట్ గాయాలు అయ్యాయి. గాయపడిన పౌరులను ఆసుపత్రికి తరలించినట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు. ఎన్ కౌంటర్ తరువాత అత్యాధునిక తుపాకులతో పాటు గ్రనేడ్లు, మందుగుండు సామాగ్రిని సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు.
Jammu And Kashmir
Encounter
Anantnag
Army

More Telugu News