వేట మొదలైంది... కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల ఎన్ కౌంటర్... వీర మరణం పొందిన జవాను!
- ప్రారంభమైన ఉగ్రవాదుల వేట
- అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
- ఇద్దరు పౌరులకు గాయాలు
విషయం గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించగా, సైనికులు ఎన్ కౌంటర్ ప్రారంభించారు. ఈ ఘటనలో ఓ జవాను వీరమరణం పొందగా, మరో ఇద్దరు పౌరులకు బులెట్ గాయాలు అయ్యాయి. గాయపడిన పౌరులను ఆసుపత్రికి తరలించినట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు. ఎన్ కౌంటర్ తరువాత అత్యాధునిక తుపాకులతో పాటు గ్రనేడ్లు, మందుగుండు సామాగ్రిని సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు.