పద్దెనిమిది పైసలు తగ్గిన పెట్రోలు ధర!

  • గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోలు ధర
  • మారని డీజెల్ ధర
  • హైదరాబాద్ లో రూ. 80.52గా పెట్రోలు ధర
దాదాపు నాలుగు వారాల క్రితం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరి ఆపై తగ్గుతూ వచ్చిన 'పెట్రో' ఉత్పత్తుల ధరలు, శుక్రవారం నాడు మరింతగా తగ్గాయి. నేడు పెట్రోలు ధరల 18 పైసల వరకూ తగ్గింది. ఇదే సమయంలో డీజెల్ ధరను మాత్రం మార్చలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.  

తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 76.02, కోల్ కతాలో రూ. 78.70, ముంబైలో రూ. 83.74, చెన్నైలో రూ. 78.89గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 80.52గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 67.68, కోల్ కతాలో రూ. 70.23, ముంబైలో రూ. 71.99, చెన్నైలో రూ. 71.44గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 73.56 వద్ద కొనసాగింది.
Go Back to Shorts
Petrol
Diesel
IOCL
Slash

More Telugu News