జగన్ సారథ్యంలో ‘హోదా’ సాధించి తీరుతాం: మిథున్ రెడ్డి

  • రాజీనామాలు ఆమోదించడం సంతోషం
  • టీడీపీ ఎంపీలూ రాజీనామా చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది
  • ‘హోదా’ను అవహేళన చేసిన చంద్రబాబు ప్యాకేజ్ కు ఒప్పుకున్నారు
వైఎస్ జగన్ సారథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని మిథున్ రెడ్డి అన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మిథున్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని, ‘హోదా’ను అవహేళన చేసిన చంద్రబాబు ప్యాకేజ్ కు ఒప్పుకున్నారని విమర్శించారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6న సమర్పించిన రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఈరోజు ఆమోదించారు. 
Go Back to Shorts
YSRCP
mithun reddy

More Telugu News