Chiranjeevi: మీరిచ్చిన నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. చిరంజీవి నివాసానికి వెళ్లి థ్యాంక్స్‌ చెప్పిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులందించారు. మొత్తం రూ.5 కోట్లతో చేపట్టిన ఆ పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన కొల్లు రవీంద్ర.. ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిలోగా మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. ఆ నియోజకవర్గ ప్రజలు చిరంజీవికి రుణపడి ఉంటారని చెప్పారు. మచిలీపట్నంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. 
Go Back to Shorts
Chiranjeevi
Kollu Ravindra
Andhra Pradesh

More Telugu News