Pawan Kalyan: టీటీడీ నగలు ఏమయ్యాయో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నాకు చెప్పారు: పవన్ కల్యాణ్

  • హైదరాబాద్ విమానాశ్రయంలో మేము కలిశాము
  • ఓ ప్రైవేట్ విమానంలో విదేశాలకు నగలు తరలి వెళ్లాయని చెప్పారు
  • రమణ దీక్షితులు ఆరోపణలు ఆశ్చర్యాన్ని కలిగించలేదు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి నగలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. "కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ను కలవడం జరిగింది. ఆ సందర్భంగా టీటీడీ నగలపై ఆయన కీలకమైన విషయాలను నాకు చెప్పారు. అతను చెప్పిన దాని ప్రకారం... స్వామివారి నగలు మధ్యప్రాచ్య దేశానికి ఓ ప్రైవేట్ విమానంలో తరలి వెళ్లాయి. అందువల్లే తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. వేంకటేశ్వరస్వామి మౌనంగా ఉన్నారు... ఆయన నగలను దొంగిలించవచ్చని దొంగలు అనుకుంటున్నారు" అంటూ ట్వీట్ చేశారు.

పింక్ డైమండ్, ఇతర నగలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవని పవన్ అన్నారు. స్వామివారి ఊరేగింపు సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో పింక్ డైమండ్ పగిలిపోయిందని చెబుతున్నారని... ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో నాణేలు విసిరితే వజ్రం ఎలా పగులుతుందో చేసి చూపించాలని అన్నారు.

More Telugu News