tarun bhaskar: సురేశ్ బాబుగారు అలా అనడంతో నమ్మలేకపోయాను!: తరుణ్ భాస్కర్

  • కథ ఎంపిక విషయంలో ఆలస్యమైంది
  • యువ దర్శకుల కష్టాలనే కథగా మలిచాను 
  • ప్రివ్యూకి మంచి రెస్పాన్స్ వచ్చింది         

'పెళ్లి చూపులు' సినిమా ఘన విజయాన్ని సాధించడమే కాదు .. కొత్త ట్రెండ్ ను సృష్టించింది. తొలి ప్రయత్నంతోనే దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన నుంచి 'ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమా వస్తోంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ .. " 'పెళ్లిచూపులు' భారీ విజయాన్ని సాధించడంతో ఆ తరువాత ఎలాంటి కథను తయారుచేసుకోవాలనే విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోయాను. అందువలన ఈ సినిమా రెడీ కావడానికి చాలా గ్యాప్ వచ్చింది. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడికి వచ్చాను గనుక, యువ దర్శకులు పడే కష్టాలనే కథా వస్తువుగా చేసుకున్నాను. సురేశ్ బాబు గారిని కలుసుకుని ఆ కథను వినిపించాను. 'బాగుంది .. షూటింగు పెట్టుకోండి' అని ఆయన అనడంతో ఆశ్చర్యపోయాను. కథ గురించి ఎన్నో విధాలుగా ఆలోచించే సురేశ్ బాబు గారు ఒక్కసారిగా ఆ మాట అనడంతో నమ్మలేకపోయాను. ఫస్టు కాపీ చూసి ఆయన సంతృప్తిని వ్యక్తం చేయడం .. ప్రివ్యూ చూసిన వాళ్లు బాగుందనడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.         

More Telugu News