trinamool: ప్రతి బుల్లెట్ నూ లెక్కేసుకుంటున్నాం!: తృణమూల్ కి బీజేపీ నేత దిలీప్ ఘోష్ వార్నింగ్

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జల్పాయ్ గురిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారు వేధింపులకు పాల్పడుతున్నారని, దీనికి చరమగీతం పాడకపోతే వారిని జైలుకు పంపించడమో లేకపోతే తాము ఎదురుగా తలపడడమో జరుగుతుందని హెచ్చరించారు.

మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి విధేయులమై ఉంటామని తామేమీ బాండ్ రాయలేదని, తమ వద్ద బుల్లెట్లకు కొదవలేదని, తలచుకుంటే ప్రతిచోటా మృతదేహాలు తేలుతాయంటూ దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలను హతమార్చిన ప్రతి బుల్లెట్ ను లెక్కేసుకుంటున్నామని, ఈ విషయంలో ఎవరినీ క్షమించమని హెచ్చరించారు.
Go Back to Shorts
trinamool
bjp

More Telugu News