priyanka chopra: నా ఆత్మకథను నిజాయతీగా, ముక్కుసూటిగా రాశా: ప్రియాంక చోప్రా

  • 'అన్ ఫినిష్డ్' పేరుతో ప్రియాంక ఆటోబయోగ్రఫీ
  • 2019లో మార్కెట్లోకి రానున్న ఆత్మకథ
  • గతంలో చెప్పని విషయాలు కూడా వున్నాయి 

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరో ఘనతను సాధించింది. తన ఆత్మకథకు పుస్తకరూపం ఇచ్చింది. ఈ పుస్తకానికి 'అన్ ఫినిష్డ్' అని పేరు పెట్టారు. 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పబ్లికేషన్స్' ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. 2019లో ఇది మార్కెట్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, పరిశీలించిన ఘటనలను పుస్తకంలో వివరించానని చెప్పింది. ఎంతో నిజాయతీగా, ముక్కుసూటిగా, ఎవరినీ నొప్పించకుండా రాశానని తెలిపింది. గతంలో ఎప్పుడూ బయటకు చెప్పలేని కొన్ని విషయాలను ఈ పుస్తకంలో వివరించాల్సి వచ్చిందని తెలిపింది. 

More Telugu News