ramdev baba: అటువంటి బాబాలను ఉరితీయాలి: యోగా గురువు బాబా రాందేవ్
- గాడ్ మెన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉరి తీయాలి
- ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు
- కాషాయం కట్టుకున్నంత మాత్రాన బాబాలు అయిపోయారు
తమను తాము దైవం (గాడ్ మెన్) గా ప్రకటించుకునే బాబాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్షమించేందుకు వీలులేదని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. ఈ తరహాకు చెందిన ఓ బాబాపై అత్యాచార ఆరోపణలు తలెత్తిన విషయమై అడిగిన ప్రశ్నకు రాందేవ్ ఘాటుగా స్పందించారు.
అటువంటి బాబాలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తేలితే వారిని ఉరితీయాలని అన్నారు. హద్దులు దాటి వ్యవహరించే వారిని జైలుకు పంపడమే కాదు, ఉరితీయాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అన్నారు. కాషాయం కట్టుకున్నంత మాత్రాన బాబాలు అయిపోరని, మతనాయకుడికి కాషాయం కట్టుకోవడమే ప్రాతిపదిక కాదని, గుణగణాలు ముఖ్యమని చెప్పారు.