Telangana: తెలంగాణ వ్యవసాయ శాఖకు ప్రతిష్ఠాత్మక అవార్డు

  • ఇండియా టుడే అందించే ప్రతిప్ఠాత్మక అగ్రి అవార్డు
  • తెలంగాణలో వ్యవసాయం రంగంలో అభివృద్ధికి గానూ అవార్డు
  • వ్యవసాయంలో వేగంగా వృద్ధి చెందుతోన్న రాష్ట్రంగా తెలంగాణ
ఇండియా టుడే అందించే ప్రతిప్ఠాత్మక అగ్రి అవార్డు ఈ ఏడాది తెలంగాణ వ్యవసాయ శాఖకు లభించింది. తెలంగాణలో వ్యవసాయ రంగంలో అభివృద్ధికి గానూ ఈ అవార్డు వచ్చింది. వ్యవసాయంలో దేశంలోనే అత్యధిక వేగంగా వృద్ధి చెందుతోన్న రాష్ట్రంగా తెలంగాణకు ఇండియా టుడే గుర్తింపునిచ్చింది. ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఈ అవార్డును తెలంగాణకు ప్రదానం చేయనున్నారు.
               
ఈ అవార్డు రావడం పట్ల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం, రైతుల అభివృద్ధి కోసం తాము అమలు చేస్తోన్న పథకాలతో వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.  తమ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట పెట్టుబడిగా ఎకరాకు రూ. 8000 ను ఇచ్చే రైతుబంధు పథకం ఇస్తోందని చెప్పారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.         
Telangana
award
Pocharam Srinivas

More Telugu News