venkatesh: 'తోడల్లుళ్లు'గా వెంకీ .. వరుణ్ తేజ్

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2'
  • హీరోలుగా వెంకీ .. వరుణ్ తేజ్ 
  • ఈ నెల 23వ తేదీన లాంచ్

హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ పాత్రలు ఎలా వుండనున్నాయనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది.ఈ ఇద్దరూ 'తోడల్లుళ్లు'గా కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 30వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును హైదరాబాద్ లో మొదలుపెట్టి .. జూలై 20వ తేదీ వరకూ నాన్ స్టాప్ గా జరపనున్నారు. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్  ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News