జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా

19-06-2018 Tue 15:15
  • సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చిన బీజేపీ
  • రాజీనామా చేసిన మెహబూబా ముఫ్తీ
  • గవర్నర్ పాలన దిశగా జమ్ముకశ్మీర్
జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే... పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)తో ఉన్న సంకీర్ణ బంధాన్ని బీజేపీ తెగదెంపులు చేసుకుంది. దీంతో, ముఫ్తీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో, వెంటనే మెహబూబా రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలు వేడి పుట్టిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ మరోసారి గవర్నర్ పాలన కిందకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు పీడీపీ అధికార ప్రతినిధి రఫి అహ్మద్ మీర్ మాట్లాడుతూ, బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడిపేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నించామని... కానీ, అది జరగలేదని చెప్పారు. బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందని ఊహించలేకపోయామని అన్నారు. కాసేపట్లో ముఫ్తీ తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించబోతున్నారని పీడీపీ మంత్రి నయీమ్ అఖ్తర్ తెలిపారు.