Mahesh Babu: మహేశ్ కి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్!

  • సెట్స్ పైకి మహేశ్ 25వ మూవీ 
  • దర్శకుడిగా వంశీ పైడిపల్లి 
  • డెహ్రాడూన్ లో షూటింగ్  

మహేశ్ .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లోని సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ముందుగా చేసిన ప్లాన్ ప్రకారం ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో మొదలుపెట్టారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర కూడా చాలా బలమైనదిగా .. ముఖ్యమైనదిగా కనిపిస్తుందట.

అందువలన ఆ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తన సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ఉండేలా చూసుకుంటూ ఉంటానని ఒక వేదికపై మహేశ్ చెప్పాడు. ఆయన వలన ఆ పాత్ర ప్రత్యేకత పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే మహేశ్ సినిమాల్లో సాధ్యమైనంత వరకు ప్రకాశ్ రాజ్ కనిపిస్తూ ఉంటాడు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయో చూడాలి మరి.  

More Telugu News