saif ali khan: స్విమ్మింగ్ పూల్ వద్ద.. బీరు టిన్ తో ఫొటో దిగి.. పోస్ట్ చేసిన సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు

  • స్విమ్మింగ్ ఫూల్‌లో ఫొటోలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇబ్రహీం అలీఖాన్‌
  • ఈద్‌ రోజు ఇదేం పనని నెటిజన్ల విమర్శలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అందుకు ఆయన దిగిన ఓ ఫొటోనే కారణం. తాజాగా, ఆయన స్విమ్మింగ్ ఫూల్‌లో బీరు టిన్ పట్టుకుని ఫొటో దిగాడు. అంతటితో ఊరుకోకుండా ఆ ఫొటోను నిన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.  

దీంతో ఈద్ రోజున ఈ వేషాలేంటంటూ మొట్టికాయలు వేస్తున్నారు. కాగా, ఇబ్రహీం గతంలో ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆయనకు ఫుట్‌బాల్, క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. సైఫ్ అలీ ఖాన్‌, అతడి మొదటి భార్య అమృతాసింగ్‌ల కుమారుడే ఇబ్రహీం అలీఖాన్‌.           

More Telugu News